ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు పధకం సత్ఫలితాలను ఇస్తుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు( డిఎన్నార్)అన్నారు. గురువారం ముదినేపల్లి మండలం పెయ్యేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కు నాడు నేడు క్రింద రూ. 15. 93 లక్షల వ్యయంతో కల్పించనున్న మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిక్ఎన్నార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ఫేజ్ 1 ను విజయవంతం గా ముగించి గ్రామాల్లో పాఠశాలల రూపురేఖలు మార్చడం జరిగిందని. ఇప్పుడు రెండవ ఫేజ్2 క్రింద పెయ్యేరు ప్రాథమిక పాఠశాల కు 10 కంపోనెంట్స్ ఏర్పాటుకి ఈరోజు భూమిపూజ చేయడం ఆనందం గా ఉందని అన్నారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయులు సమన్వయం తో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అన్నారు. జగనన్న విద్యకు పెద్ద పీట వేస్తూ తీసుకున్న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుందని ఎమ్మెల్యే అన్నారు