ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీనిపై తప్పుడు ప్రచారం తగదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 02:27 PM

టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని, దీనిపై దుష్ప్రచారం తగదని టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జి. కొండూరు మండలం కవులూరు గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు ఆశయాల సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అందరూ ఖండించిన విషయం తెలిసిందేనన్నారు. 


మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారని, నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో పయనింప చేస్తారని పేర్కొన్నారు. మైలవరంలో దేవినేని ఉమా నాయకత్వంలో టీడీపీ పటిష్టంగా వుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 


పేదలకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సంక్షేమానికి ఏపీలో పునాదులు వేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, సమసమాజ స్థాపనకు తెలుగుదేశం పార్టీ పాలన అవసరమన్నారు. మండల వ్యవస్థ ప్రవేశపెట్టి, కరణం, మునుసబు వ్యవస్థను రద్దు చేసి పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలను అన్న ఎన్టీఆర్ అమలు చేశారన్నారు. ఏపీలో ప్రజలందరూ నేడు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. మహానాడు సక్సెస్ అవ్వడమే దీనికి నిదర్శనం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com