కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మత్యాకార మోర్చా ప్రెసిడెంట్ బొమ్మిడి గణేష్, కృష్ణా జిల్లా అధ్యక్షులు మట్టా ప్రసాద్, ఆధ్వర్యంలో శ్రీపాద ఫంక్షన్ హాల్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపిందని తెలియజేశారు.
స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పాలన జనరంజకంగా ఉందని, కరోనా మహమ్మారి ఇ ను ఎదుర్కొనడంలో విజయం సాధించడమే కాకుండా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా హెల్త్ అండ్ సెంటర్లో ఏర్పాటు చేసి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు 7784 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కేంద్రం నిర్మించిందని, 53. 61 లక్షల ఈశ్రమ కార్డులను మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర అ కీలకమైనది.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ద్వారా 3590 కోట్ల రూపాయలు ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆత్మ నిర్బర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 209 కోట్లు కేటాయించిందని, పిఎం కేర్స్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 351 మంది కోవిడ్ బాధిత అనాధ చిన్నారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా నిలబడినారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లో 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. చిట్టచివరి గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టడం ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని తెలిపారు.