చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పెద్ద రామాపురం పంచాయతీకి చెందిన చంద్ర శేఖర్ నాయుడు బుధవారం ద్విచక్ర వాహనంపై తిరుపతి బయలుదేరాడు. జాతీయ రహదారిపై గాదంకి వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.