ఈ నెలలో ఆకాశంలో అద్భుతం జరుగనుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలన్నీ కూడా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేయనున్నాయి. ఇటువంటి అరుదైన ఘట్టాన్ని, గ్రహాల వరుసను స్కైవాచర్లతో చూడొచ్చు. గ్రహాలన్నీ ఈవిధంగా ఒకే వరుసలోకి రావడాన్ని శాస్త్రవేత్తలు "ప్లానెట్ పరేడ్" అని పిలుస్తారు. జూన్ 24న ఇవి ఈ గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి.