తమిళనాడులోని అనేక జిల్లాల్లోని నగరాలు, పట్టణాలకు టెంపుల్ టౌన్ అనే పేరు ఉంది. తమిళనాడులో 1960 నుంచి 2008 మధ్య కాలంలో కొన్ని వందల పురాతన విగ్రహాలు చోరీ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. పురాతన విగ్రహాలు విదేశీయులను విక్రయిస్తున్న స్మగ్లర్లు కోట్ల రూపాయలు సంపాధిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. ఇప్పటికీ స్మగ్లర్లు పురాతన విగ్రహాల మీద కన్ను వేస్తూనే ఉన్నారు. 15, 16వ శతాభ్దంలో చోరీకి గురైన విగ్రహాలు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విదేశాల్లో ఉన్న పురాతన విగ్రహాలు భారత్ కు తిరిగి తెప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్ లోని ఆసియా సొసైటీ మ్యూజియంలో ఉన్న శివుని కాంస్య విగ్రహం, ఇండియానా మ్యూజియంలో ఉన్న తంజావూరులో చోరీకి గురైన వాన్మింగస్వామి, పార్వతి దేవి విగ్రహాలు, నాలుగు చేతుల విష్ణువు విగ్రహాలు, శ్రీదేవి విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం భారత్ కు తీసుకు వచ్చింది.
తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో చోరీకి గురై న్యూయార్క్ మ్యూజియంలో ఉన్న నాలుగు చేతుల విష్ణువు విగ్రహాలు, శ్రీదేవి విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం భారత్ కు తీసుకు వచ్చింది. మొత్తం 8 కాంస్యం, రెండు పురాతన రాతి విగ్రహాలను భారత్ తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబుకు అప్పగించారు.