తమ గోడును కేంద్రం వినిపించుకోవడంలేదు...ఇటు ఉగ్రదాడులు ఆగడంలేదు. ఫలితంగా కశ్మీర్ పండిట్లు తమ స్వస్థలాలను విడిచి వలసెళ్లిపోతున్నారు. గత నెలలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న రాహుల్ భట్ అనే కశ్మీర్ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కానీ స్థానికులు మాత్రం భయాందోళనకు గురువుతన్నారు. ఆ తర్వాత మరో స్కూల్ టీచర్‌ను కాల్చి చంపారు. దీంతో మిగతా కశ్మీర్ పండిట్లు ఆందోళనకు దిగారు. తమను రీ లోకెట్ చేయాలని కోరుతున్నారు. కశ్మీర్ వెలుపల.. సురక్షితమైన ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. కుల్గాంలో ఓ హిందూ టీచర్ రజనీ బాలా కూడా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత 100కు పైగా హిందూ కుటుంబాలు కశ్మీర్‌ను వదిలి వెళ్లాయని ఓ మత పెద్ద తెలిపారు. తర్వాత పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చు అనే సందేహం కలుగుతుంది. అందుకే ఒక్కొక్కరు తమ నివాసాలన వదిలి.. సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.
బారాముల్లాలో కూడా 300 కుటుంబాలు వెళ్లాయని కాలనీ ప్రెసిడెంట్ అతతార్ కృష్ణ భట్ తెలియజేశారు. మంగళవారం జరిగిన హత్యతో వారు భయపడ్డారని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం తాము చూస్తున్నామని.. రియాక్షన్ బట్టి తమ చర్య ఉంటుందని తెలిపారు. మరో ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. ఆ తర్వాత తాము కూడా వెళ్లడం తథ్యం అని సంకేతాలను ఇచ్చారు.
శ్రీనగర్‌లో ఒక ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. కశ్మీర్ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండే ప్రదేశాల్లో భద్రతను కూడా పెంచారు. పండిట్ల అభ్యర్థనపై పాలానా యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే గత నెలలో లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాత్రం.. భద్రత కల్పించడంలో కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.