వారు జవాన్లు అది మరించి...ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొన్నారు. ఇద్దరూ మరణించారు. కన్నవాళ్లకు శోకం అందించారు. ఎస్పార్పీఎఫ్ జవాన్లు ఇద్దరు ఒకరుపై ఒకరు కాల్పులు జరుపుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. గడ్చిరోలిలోని అహేరీ తాలుకా మార్‌పల్లే జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు. ముంబయికి చెందిన శ్రీకాంత్ బెరాడ్ మరో సైనికుడు బందు నోథోర్‌పైకి తొలుత కాల్పులు జరపగా తిరిగి అతడు కూడా తన సర్వీసు రివాల్వర్‌లో కాల్చాడు. వ్యక్తిగత కక్షలతోనే ఇద్దరూ ఇలా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇద్దరూ పుణే ఎస్సార్పీఎఫ్ గ్రూప్ 1కి చెందిన జవాన్లుగా గుర్తించారు. ఇరువురి మధ్య చెలరేగిన వాగ్వాదం కాల్పులు జరుపుకునే వరకు వెళ్లిందని అధికారులు తెలిపారు.
నోథోర్ శరీరంపై మూడు బుల్లెట్ గాయాలున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపారు. అయితే, ఇరువురూ రౌండ్లు కాల్పులు జరుపుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇరువురి మధ్య వివాదానికి కారణం ఏంటనేది తెలియరాలేదని అన్నారు. అక్కడ ఉన్న మిగతా జవాన్లను ఈ ఘటనపై విచారిస్తున్నామని, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నామని తెలిపారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న గడ్చిరోలి పోలీసులు. పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిముల్‌గట్టా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దీనిపై సబ్-డివిజనల్ పోలీస్ ర్యాంకు అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ బెటాలియన్ ఫిబ్రవరిలోనే మార్‌పల్లెకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గడ్చిరోలిలో మావోయిస్ట్‌లతో పోరాడుతున్న స్థానిక పోలీసులు, కేంద్ర పారామిలటరీ బలగాలకు సాయంగా వీరిని తీసుకొచ్చారు.