దేవాలయాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే టక్కున చెప్పే పేరు తమిళనాడు. తమిళనాడులోని అనేక జిల్లాల్లోని నగరాలు, పట్టణాలకు టెంపుల్ టౌన్ అనే పేరు ఉంది. తమిళనాడులో 1960 నుంచి 2008 మధ్య కాలంలో కొన్ని వందల పురాతన విగ్రహాలు చోరీ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉన్న పురాతన విగ్రహాలను చోరీ చేసిన స్మగ్లర్లు వాటిని విదేశీయులకు విక్రయించారు. ఇప్పటికీ స్మగ్లర్లు పురాతన విగ్రహాల మీద కన్ను వేస్తూనే ఉన్నారు. 15, 16వ శతాభ్దంలో చోరీకి గురైన విగ్రహాలను విదేశాల నుంచి భారత్ కు తెప్పించిన కేంద్ర ప్రభుత్వం వాటిని తమిళనాడుకు అప్పగించింది. ప్రజలు ఎంతో నమ్మకంతో, భక్తిశ్రద్దలతో పూజించే విగ్రహాలు చోరీ కావడంతో గతంలో భక్తులు కలతచెందారు. ఇదే సమయంలో చోరీకి గురైన విగ్రహాలు, విలువను లెక్కకట్టలేని విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడంతో ప్రజలు సంతోషిస్తున్నారు.