మార్కెట్ లోకి అందమైన ఫోన్ల రాక కొనసాగుతుతోంది. తాజాగా మోటోరోలా నుంచి రూ.10వేలలోపు ధరతో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. తక్కువ ధరలో ఆల్‌రౌండ్ మొబైల్ కావాలనుకున్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా ఉండనుంది. బడ్జెట్ ఫోన్ మోటో ఈ32ఎస్ (Moto E32s) మొబైల్ జూన్ 2న అంటే రేపు భారత్‌లో లాంచ్ కానుంది. ఇటీవలే యూరోప్ అడుగుపెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాకు వస్తోంది. లాంచ్‌కు ఒక్కరోజు ముందు ఈ ఫోన్ ధరను మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. అలాగే సేల్ వివరాలను కూడా వెల్లడించింది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో మోటో ఈ32ఎస్ వస్తోంది. 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి.
మోటో ఈ32ఎస్ మొబైల్ ప్రారంభ ధరను రూ.9,299గా మోటోరోలా నిర్ణయించింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.