ఏపీలోని కోనసీమ జిల్లా పేరు మార్పుపై తలెత్తిన ఘర్షణలలో మే 24 నుంచి అక్కడ ఇంటర్‌నెట్ సేవలను నిలిపి వేశారు. రెండు రోజుల క్రితం నాలుగు జిల్లాలో ఇంటర్‌సేవలను పునరుద్ధరించగా, తాజాగా మరో 8 జిల్లాలకు ఆ సౌలభ్యం కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలైన అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మడివరం మండలాల్లో ఇంటర్‌నెట్ బంద్ కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa