పోలాకి మండలం, ఆల్ ఇండియా నేషనల్ నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలలో పోలాకి మండలం ఈదులవలస ఆదర్శ పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆర్. పద్మాకర్ రావు ఆల్ ఇండియా లో 81 వ ర్యాంకు సాధించి పాఠశాలకు ప్రతిభను కనబరిచాడు.శుక్రవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ లో విద్యార్థికి ప్రిన్సిపాల్ పైడి ప్రవీణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు . శ్రేష్ట వారు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మా విద్యార్థి మంచి ర్యాంకును సాధించారు. ఈనెల 7వ తేదీన విద్యార్థి వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రవేశం పొందడం జరుగుతుంది ఉన్నత విద్య పాఠశాల వారు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ . బొజ్జ జగన్నాథం విద్యార్థి తండ్రి ఆర్. త్రినాధ రావు ఫిజికల్ డైరెక్టర్.ఏం నీలం మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa