అల్లూరి జిల్లా, ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం సుకూరు పంచాయతీ చట్రాయిపుట్టు గ్రామంలో గల గిరిజనులు తమ భూముల తమకు అప్పగించాలని చేపట్టిన దీక్షరోజులుగడుస్తున్నా న్యాయం జరగక దీక్ష శిబిరంలో వున్నా చట్రాయిపుట్టు గ్రామం గిరిజన బాధితులను నేడు మన్యంలో బీజేపీ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు పాంగిరాజారావు,పార్టీ నాయకులు వారిని పరామ ర్శించి,దీక్షకు మద్దత్తు తెలుపుతూ వారితో పాటు నేడు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మాట్లాడుతూ..! చట్రాయి పుట్టు గ్రామం లో కొన్ని సంవత్సరాలు గా నివాసం ఉంటున్న గిరిజనులు, వారి పట్టా భూమిలో చిన్న పాకలు నిర్మించుకుంటే,దానిని హుకుంపేట రెవిన్యూ సిబ్బంది సంబంధిత గిరిజనులకు ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా జేసీబీ తో పాకలను తొలగించడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని,గిరిజన ప్రాంతంలో అనేక భూములు అక్రమార్కులతో అన్యాక్రాంతం అవుతుంటే రెవిన్యూ సిబ్బంది చోధ్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు.
గిరిజన ప్రజల భూములను లాక్కోవడానికి రెవిన్యూ శాఖ అతి ఉత్సాహందేనికి సంకేతం అన్నారు,చట్రాయి పుట్టు భూమి సమస్య పరిష్కారం జరిగేంత వరకు బీజేపీ వీరికి మద్దతుగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ హుకుంపేట మండల అధ్యక్షులు వంతలా గాసన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శరబ వేమన్న,యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్య కొండ బాబు,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తూబురు దేవన్ రాజు, జిల్లా నాయకులు జన్ని సత్తిబాబు, జన్ని చిన్న తల్లి, కొండపల్లి రాంబాబు,కొర్ర ఆనంద్, వై ఎస్ స్టాలిన్, మాజీ ఏం పి టి సి రమేష్,మండల నాయకులు సోంబాబు తదితరులు పాల్గొన్నారు.