భీమవరం గర్భిణీలు తగు జాగ్రత్తలు పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటే , ప్రసవం సులభ తరం అవుతుందని , గ్రుడ్లు పండ్లు, పాలు, ఆకు కూరలతో సంపూర్ణ పౌషక విలువున్న, ఆహారం ఉందని, ప్రతి శుక్రవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహారం దాతల ద్వారా అందించే కార్యక్రమం మన భీమవరం లోనే జరుగుతుందని అనటంలో ఆశ్చర్యం లేదని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి , గైనకాలజిస్ట్ డా. నవీన అన్నారు.
శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఉచితంగా, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బిజెపి నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం కార్యక్రమం ప్రారంభించి, కొన్ని సంవత్సరాల కాలంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అభినందనీయులని, నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు.