రుతుపవనాలు వేగంగా కదలడం వల్ల ఐదు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, కర్ణాటక, కేరళ, బీహార్, ఝార్ఖండ్ తోపాటు ఒడిశా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఐదు రోజుల పాటు భీకరమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.