ఉమ్మడి కర్నూలు జిల్లాలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. దీంతో శుక్రవారం 22 మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షం కురిసింది. మే నెలలో కురిసిన వర్షానికి పొలాలను దున్నిన రైతులు ఈ వర్షానికి విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరులో 64. 2 మి. మీ. హొళగుందలో 52. 2 మి. మీ, ఆదోనిలో 40. 4, మిడ్తూరులో 38. 2, పగిడ్యాలలో 36. 4, పత్తికొం డలో 34. 2మి. మీ. వర్షపాతం నమోదైంది. ఆస్పరిలో 34 మి. మీ. మద్దికెరలో 32. 4, బనగానపల్లెలో 29. 2, ప్యాపిలిలో 24. 4, చిప్పగిరిలో 22. 6 మి. మీ. కురిసింది. కౌతాళంలో 18. 6 మి. మీ. హాలహర్విలో 17. 8, తుగ్గలిలో 15. 8, నందవరంలో 13. 2, కోసిగిలో 12 ఓర్వకల్లులో 10. 2, పెద్దకడుబూరులో 10. 2, దేవన కొండలో 10. 2 మి. మీ. వర్షపాతం నమోదైంది. శ్రీశైలం, గోనెగండ్ల, ఆత్మకూరు, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయి