తమిళనాడులోని కడలూరులో కేడిలం నదిలో ఏడుగురు బాలికలు మునిగిపోయి మృతి చెందారు.నదిలో స్నానం చేసేందుకు బాలికలు వచ్చారు.వారు నీటిలో దిగిన కొద్దిసేపటికే నీటి ప్రవాహం పెరిగింది. దాంతో ఆ బాలికల్లో కొందరు నీటిలో మునిగిపోయారు.అక్కడి ప్రజలు నదిలోకి దిగి వారిని బయటకు తీశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే బాలికలు మృతి చెందారు. మృతులను సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిషా (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)లుగా గుర్తించారు.