పదవతరగతి పరీక్ష ఫలితాలు నిన్న విడుదలైన సందర్భంగా , దాదాపుగా 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ ఐనట్లు విద్యాశాఖ తెలియచేసింది. దీనిపై స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ.... టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. ఇది జగన్ రెడ్డి సర్కారు ఫెయిల్యూర్. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్ర జరిగింది. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో ప్రభుత్వం అభాసుపాలు అయ్యింది. టెన్త్ రిజల్ట్స్ వాయిదా..దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే. నాడు నేడు పేరుతో 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసారు. టీచర్లకి వైన్‌షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై పెట్టలేదు.ఒక్క డిఎస్సీ తీయకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. 71 స్కూళ్లలో జీరో పాస్..20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వడం వైసిపి ప్రభుత్వం పాపమే అని ధ్వజమెత్తారు.