ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనకు పోలీస్ అధికారులు చేసిన పటిష్ఠ బందోబస్ట్ ఏర్పాట్లను పరిశీలించి, పర్యవేక్షించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. ఈ రోజు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ట్రయిల్ కాన్వాయ్ నిర్వహించగా, ఎస్పీ పరిశీలించినారు. తదనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఐఏఎస్ , మరియు ఇతర అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ శాఖ తరపున చేసిన భద్రత ఏర్పాట్ల గురించి కలెక్టర్ గారితో చర్చించడం జరిగినది.