బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనపై సొంత పార్టీ నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. పార్టీ గేట్ కుంభకోణం నేపథ్యంలో పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో బోరిస్‌కు అనుకూలంగా 211, వ్యతిరేకంగా 148 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయకు పదవీ గండం తప్పింది. 2020లో కరోనా సమయంలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకున్నారు. దీనిపై ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు సైతం ఆగ్రహించారు.