పాకిస్థాన్‌లో 2006లో టీమిండియా పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షోయబ్ అక్తర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సచిన్‌ను టార్గెట్ చేసుకుని, అతడి శరీరాన్ని గాయపరచడమే లక్ష్యంగా బంతులేశానని అక్తర్ చెప్పాడు. తాను సంధించిన ఓ బాల్ సచిన్ హెల్మెట్‌కు తగిలిందని, అయితే అతడిని మాత్రం ఔట్ చేయలేకపోయానని పేర్కొన్నాడు.