టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ మరియు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL 2022 సీజన్‌లో అతని అత్యుత్తమ నాయకత్వం తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గుజరాత్‌ను చాంపియన్‌గా నిలబెట్టి శభాష్ అనిపించుకున్నాడు. అయితే తన కెరీర్ సక్సెస్‌కి మహేంద్ర సింగ్ ధోనీ కారణమని హార్దిక్ పాండ్యా చెప్పిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మహీ అండగా నిలవకపోవతే తాను ఇక్కడికి వచ్చేవాడినని, ధోనీ సారథ్యంలో ఆడడం తన అదృష్టమని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా ఫేవరెట్ క్రికెటర్ అంటే సహజంగానే ధోనీ అనే పేరు వచ్చింది.
చాలా మంది ఆటగాళ్లు సాధారణంగా తమ అభిమాన క్రికెటర్లను సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ, బ్రియాన్ లారా, షేన్ వార్న్, కలిస్ మరియు సంగక్కర వంటి దిగ్గజాలుగా పేర్కొంటారు. అయితే, తన అభిమాన క్రికెటర్ భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. హార్దిక్ తన సోదరుడు కృనాల్ పాండ్యాతో తనకున్న అనుబంధాన్ని కూడా వివరించాడు.'జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి నా అభిమాన క్రికెటర్ వసీం జాఫర్. అతను బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎలాగోలా నేను వసీం జాఫర్ బ్యాటింగ్‌ని కాపీ కొట్టాను. కానీ నేను అతని క్లాస్‌ని ఎప్పుడూ అందుకోలేదు అని తెలిపాడు.