హత్య కేసులో ఆర్మూర్ కు చెందిన దాసరి బాల నర్సయ్య అనే ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 19న ఆర్మూర్ గోల్ బంగ్లా వద్ద ఉంటున్న రాజేందర్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన నివసిస్తున్న దాసరి బాల నర్సయ్యకు టీవీ శబ్దం తగ్గించాలని కోరాడు. దాంతో కోపంతో నర్సయ్య రాజేందర్ రెండు చెవులపై గట్టిగా కొట్టగా రాజేందర్ అక్కడికక్కడే చనిపోయారు. రాజేందర్ భార్య రూపా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం నర్సయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.