చిత్తూరు: పెనుమూరు మండలం , ఏనుగు మల్లయ్య కొండ పల్లి వద్ద గల అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగిన జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం వారి ఆహారం ఇస్తున్నారా లేదా అని పిల్లలను అడిగారు. అదే విధంగా వారి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలను అడుగుతూ వారు ఉన్నవెయిట్, హైటు వివరాలను ప్రశ్నించారు. తక్కువబరువు గల పిల్లలపట్ల తీసుకున్న ప్రత్యేక చర్యల గురించి అడిగారు.