అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ తాండలో శివారులో చిరుత పులులు సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో మూడు చిరుత పులులు కొండపై కనబడడంతో గాలిమరల సిబ్బంది పరుగులు తీశారు. చిరుతపులులు తరచూ జీవాలపై దాడులు చేసి తింటున్నాయని స్థానికులు అంటున్నారు. చిరుతపులులు సంచారంతో గ్రామ రైతులు పొలాలకు పోవలంటే భయపడుతున్నారు. అటవీశాఖ ఆధికారుల స్పందించి చిరుతపులులను బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.