వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అనంతపురం జిల్లా యాడికి కేంద్రంలో నివాసం ఉంటున్న గంగాధర్ రెడ్డి ఇంట్లో నిద్రపోయిన ఆయన. నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం గంగాధర్ రెడ్డి నిద్రలేవకపోవడం. ఎంత పిలిచినా పలక్కపోవడంతో. కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. పల్స్ కూడా లేకపోవడంతో మరణించినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించింది. అనంతరం గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగాధర్ రెడ్డి పేరు కూడా ఎక్కువగా వినిపించింది. వివేకానంద రెడ్డి చంపిన హంతకులు. హత్యానేరాన్ని తనపై వేసుకోవాల్సిందిగా రూ. 10 కోట్లను గంగాధర్ రెడ్డికి ఆఫర్ చేశారని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొనడం సంచలనం రేపింది. అంతేకాదు అప్రూవర్‌గా మారిన వివేకానంద రెడ్డి కారు డ్రైవర్ దస్తగిరితో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారని. తమ పేర్లు బయట పెట్టకుంటే. లైఫ్ సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారట.
మరో కీలక విషయం ఏమిటంటే. ఈ కేసులో తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి గతంలోనే పోలీసులను ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులతో పాటు సీబీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని 2021 నవంబర్ 29న అనంతపురం ఎస్పీ పకీరప్పకు ఫిర్యాదు చేశాడు. సీబీఐ అధికారుల నుంచి తనపై ఒత్తిడి ఉందని. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఆయనకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ కూడా చెప్పారు. దీనిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని కూడా అప్పట్లో ఆయన మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే గంగాధర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం రేపుతోంది.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ 3న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వివేకాడి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని. వైఎస్ భాస్కర్ రెడ్డికి, సీఎం జగన్ కు అప్పట్లో ఆక్ష్న లేఖ కూడా ఆయన రాశాడు. పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈకేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి కూడా మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంగాధర్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక కీలక విషయాలు బయటపడే అవకాశముంది.