మూడేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేశారని ఎంపీపీ బోర పుష్ప అన్నారు. ఇచ్ఛాపురం మండలం లోని బిర్లంగి ఉన్నత పాఠశాలలో 'మనబడి నాడు నేడు' కార్యక్రమంలో భాగంగా రూ. 63 లక్షలతో భవన మరమ్మతుల పనులను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు వాసంతి పట్నాయక్, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, దూపాన సూర్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ రవీంద్ర రౌళో పాల్గొన్నారు.