జగన్మోహన రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాజమండ్రి ఎంపి భరత్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సీనియర్ నాయకులు ముప్పన ప్రభాకర్ అధ్వర్యంలో స్థానిక 1వ వార్డ్ లో 2వ సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ద్వారా లబ్దిపొందిన వివరాలను తెలుపుతూ ప్రభుత్వ ముద్రించిన కరపత్రాలు అందజేశారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదరికమే అర్హతగా భావించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత వై. యస్ జగన్మోహన రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయా లేదా? తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగలిగామని ఆనందంతో ఎంపీ కి ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు, వార్డ్ ఇంచార్జులు, వివిధ విభాగాల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.