లోకల్ ఛానెల్ సీటీవీ యజమాని మైలపల్లి నూకరాజుపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించామని సోంపేట ఎస్. ఐ. జి. నారాయణస్వామి చెప్పారు. ఏప్రిల్ 15న విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రాత్రి 10 గంటల సమయంలో నూకరాజుపై బి. ఎస్. కాలనీలో దాడి జరిగింది. ఈ సంఘటనలో సోంపేటకు చెందిన ఎం. సంజయ్, బెంకిలికి చెందిన ఎం. దుర్యోధన, బూరగాంకు చెందిన డి. బాలరాజు, పెద్ద శ్రీరాంపురంకు చెందిన ఎల్. కిశోర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించామని ఎస్. ఐ. చెప్పారు. బెంకిలికి చెందిన కె. ధర్మారావుని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.