తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ బి. లక్ష్మీపతి అధికారులకు సూచించారు. సోంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ ఆధ్వర్యంలో అధికారులు, సచివాలయ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ డీఈ సూర్యప్రకాశ్, జేఈ రమేష్, పీఐయూ జేఈ ధనుంజయం, ఆర్ డబ్ల్యూఎస్ జేఈ మోహన్, హౌసింగ్ ఏఈ శివరామకృష్ణ, విద్యాశాఖాధికారి ఎస్. జొరాడు, ఏపీఎం మల్లేశ్వరరావు, ఏపీఓ ప్రమీల పాల్గొన్నారు.