మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో పౌడీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక కుమార్తె మృత దేహాన్ని ఓ తండ్రి భుజాలపై మోసుకొచ్చాడు. అస్వస్థతగా ఉన్న తమ చిన్నారిని తొలుత బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం దామోహ్ జిల్లా ఆస్పత్రికి మంగళవారం తరలించగా, అక్కడ కన్నుమూసింది. కుమార్తె శవంపై టవల్ కప్పి, బస్సులో కొంత దూరం, ఆ తర్వాత కాలినడకన సొంతూరుకు చేరుకున్నాడు.