సొంత పార్టీ నాయకత్వానికి జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఖాళీ పేపర్ తో ఓటు వేశారని విమర్శలు రాగా దీనిపై స్పందించిన ఆయన తాను ఓటు వేశానని, కానీ అది కాంగ్రెస్ కు క్రాస్ ఓటు వేశానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటు వేశానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ను ప్రేమిస్తున్నానని... అందుకే ఆ పార్టీకి ఓటు వేశానని తెలిపారు. క్రాస్ ఓటు వేసిన శ్రీనివాస్ గౌడ కాంగ్రెస్ లో చేరుతానని గతంలో ప్రకటించిన సంగతి గమనార్హం. మరోవైపు, క్రాస్ ఓటింగ్ కు భయపడిన జేడీఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచింది. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ను సమర్పించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.