తిరుమల వెంకన్నకు మే నెలలో హుండీ ద్వారా రూ.130.29 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ చరిత్రలో ఓ నెలలో వచ్చిన అత్యధిక ఆదాయం ఇదేనని ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే నెలలో స్వామివారిని 22,62,000 మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రూ.1.86 కోట్ల మేర జరిగాయని తెలిపారు.
ఇదిలావుంటే కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తుతోంది. ఇటీవల సర్వదర్శనాలు, శీఘ్రదర్శనాలకు టీటీడీ అనుమతించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.