ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరుబాట చేపట్టాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 నుంచి రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది
వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తున్న విపక్ష టీడీపీ వరుసబెట్టి నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి రైతు పోరుబాట పేరిట బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. తొలి సభను ఈ నెల 20న కడప పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్నట్లు టీడీపీ ప్రకటించింది. మొత్తంగా 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ తీర్మానించింది.
తొలి సభను ఈ నెల 20న కడప పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఈ నెల 25న నెల్లూరు, జులై 1న కాకినాడ, 7న విజయనగరం,13న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రైతు పోరుబాట బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు టీడీపీ వెల్లడించింది. ఈ సభల్లో 7 ప్రధాన సమస్యలపై రైతులను చైతన్యవంతం చేసేలా టీడీపీ కార్యాచరణను రూపొందించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. రైతుల పాలిట ఉరితాళ్లు అనే అంశంపై ఈ సభల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది.