ఉంగుటూరు మండలం పొణుకుమాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాల్గొన్నారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవడికైనా మట్టి ఎంటో, మట్టి కున్న ప్రాధాన్యత ఎంటో అర్ధం అవుతుంది. ఇదేదో గ్రానైట్, బాక్సైట్, బొగ్గు, వెండి, బంగారం కాదన్నారు. కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు ఇతర దేశాల నుంచి మట్టిని తీసుకురావటం లేదు కదా అన్నారు. ఇక్కడ మట్టి తవ్వి కుప్పం తరలిస్తున్నారా.
మాంసం కన్నా మసాలా ఖర్చు ఎక్కువ అన్నట్లు మాదిరిగా మట్టి ఖర్చు కన్నా డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. మట్టి డోల్ మైట్, బాక్సైట్, గ్రానైట్ లా మట్టి ఖరీదైన వస్తువు కాదన్నారు. బరువు ఎక్కువ ఖర్చు తక్కువ అన్నారు. ఇంగిత జ్ఞానం లేనివారు రాజకీయం వస్తే కటిక పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని చెప్పారు.
కటిక పేదవాడైనా, కుబేరుడైనా తమ ఇళ్లు నిర్మాణం కోసం, రైతులు తమ పొలాలు మెరక తొలుకోవటానికి మట్టి ఎంతో అవసరం ఉంటుంది. వీరికి మట్టి ఎక్కడ నుంచి వస్తోంది గ్రామాల్లో చెరువుల నుంచి కాదా లేదంటే పై నుంచి బాబాలు దగ్గర నుంచి మట్టి వస్తోందా అన్నారు. ట్రాక్టర్లు, ప్రొక్లైయిన్ డీజిల్ కే ఖర్చు అవుతోందని డబ్బులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. మట్టి అవసరం అనుకుంటే 8ఏళ్ళు నుంచి పోలవరం కుడికాల్వ పై కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. పిచ్చి ప్రేలాపనలు, ఉరికే అల్లరి చేస్తున్నారు. వీళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లు. నీ మీదా బురద జల్లుతాం. తారు వేస్తాం మీరే ఉత్కోవాలి బాధ్యత మీదే అన్నట్లుగా ఇలాంటి విమర్శలు ఉంటాయిన్నారు.
జస్టిస్ చౌదరిలుగా రోడ్డు పై వెళ్లే ప్రతివాడు కామెంట్స్ చేస్తుంటారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు తెలిపాను. జగన్ నన్ను పని చేయమని చెప్పారు. వాళ్లకి ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్టానం కి చెప్పుకోవాలి , వారికి ఇంకా బాధ ఉంటే జగన్మోహన్ రెడ్డిని కలవాలి ఇలాంటి మాటలు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఎన్నికల మందు తాజమహాల్ కట్టిస్తామని ఎదేదో మాట్లాడి కొంతమంది వ్యక్తులు వెళ్లిపోయారు. ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు, పేదలకు ఇళ్ల స్దలాలు , పట్టాలు , ఆరోగ్య శ్రీ కింద పేదలకు ఉచిత వైద్యం అందేలా చూడటం. నన్ను భగవంతుడు బాగానే ఆశీర్వదించాడు ప్రస్తుతం ఆర్ధికంగా నిలబడ్డ తద్వారా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.
నేను 15 సినిమాలు తీశాను ఎన్నో క్యారెక్టర్లు చూశాను ఉరు వదలి, దేశం వదలి వెళ్లి, ఉత్ ని హడావుడి చేసి వెళ్లే వాళ్లు ప తోక ముడిచి కాళ్ల సందులో పెట్టుకుని వెళ్లిపోయిన వ్యక్తులను గన్నవరంలో చాలా మంది చూశాను. నా రాజకీయ ప్రస్ధానంలో ఎంతో మంది చూశాను ఇవన్ని నేను చూసుకుంటాను. నేను హీరోనో, విలన్ నో అనే విషయం గన్నవరం నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారు. ఒకవేళ అలా పోయిన నేను వల్లభనేని వంశీ గానే ఉండిపోతానని గట్టిగా చెప్పారు. నేను విలన్ అని అన్నవాడు అతనో హీరో మహేష్ బాబు, అతని పక్క ఉన్న వ్యక్తి హీరో ప్రభాష్ కాదు కదాని తనదైన శైలిలో వ్యంగంగా సమాధన ఇచ్చారు.
మట్టి గురించి నానాయాగి చేసేవారు ఒక నాయకుడు అపార్టుమెంట్ కట్టడానికి , మరోక ప్రముఖులు ఆసుపత్రికి నిర్మాణం కోసం , ప్రస్తుతం మరోక నాయుకుడు సంబంధించిన చేరువు పూడ్చుకోవటానికి మట్టి ఎక్కడ నుంచి తరలిస్తున్నారు పక్క ఉరి నుంచి కాదని విమర్శించారు. మట్టి ఆక్రమంగా తరలిపోతుంది నానా యాగి, అల్లరు చేసి పేదవాడికి మట్టి అందకుండా చేస్తున్నారని అన్నారు. బొగ్గు మట్టికి, బాక్సైట్ మట్టికి, బంగారం మట్టికి తేడా తెలియని వ్యక్తులు పేద ప్రజలు జగనన్న ఇళ్ల కోసం మట్టి తోలుకుంటుంటే నానా అల్లరి చేస్తున్నారని వీరికి తోడు కొన్ని వార్తపత్రికలు, కొంతమంది మీడియా వాళ్లు తోడై మట్టి ఎదో ఖరుదైన వనరుని ఎక్కడో నుంచి మట్టి తోలుతున్నారని నానా అల్లరి చేస్తున్నారని విమర్శించారు.
ట్రాక్టర్లు మట్టిని నాలుగు కిలోమీటర్లు తోలితే కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావన్నారు. ఇవన్ని వృధా ప్రేలాపనలు, పిచ్చి మాటలు, బురద జల్లే మాటలు తప్ప. ఎవరికి ఉపయోగపడేవి కాదని వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు.