ప్రపంచంలో ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ అగ్రగామిగా నిలిచింది. ఈ రంగం రెండు అంకెల వృద్ధి రేటు సాధిస్తున్నా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పెరుగుతున్న ఫీడ్ ధరలు, గిట్టుబాటు గానీ ధరలకు తోడు విద్యుత్ కోతల ప్రభావంతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. మరోవైపు అధిక డీజిల్ ధరలు, అనవసరపు విద్యుత్ కోతలతో చేపలు, రొయ్యలకు ప్రాణవాయువు అందడం కష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో ఐకరాలలోపు చెరువులకే సబ్సిడీని పరిమితం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు... విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున వసూలు చేసేవారు. ఐదెకరాలు దాటిన చెరువులకు రాయితీ ఎత్తివేడయంతో వేలాది రూపాయల బిల్లులు వస్తుండటంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఆక్వా పరిశ్రమ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఫీడ్ ధరలు, చేపలు, రొయ్యలు ధర గిట్టుబాటు కాకా సతమతమవతున్నా ఆక్వా రైతులకు తరచు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పాటు ఇప్పటి వరకు ఇస్తున్న విద్యుత్ రాయితీని ఐదెకరాలకు పరిమితం చేయడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ కోతలు ఆక్వా దిగుబడులప తీవ్ర ప్రభావం చూపుతుంది.
వేసవి ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఏరియేటర్లు ఆపితే చేపలు, రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు కిలోకు రూ. 50ల నుంచి రూ. 100లకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పంట చేతికి వచ్చే ప్రస్తుత తరుణంలో విద్యుత్ కోతలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యుత్ కోతలు ఇలా ఉంటే ఇప్పటి వరకు ఆక్వా చెరువులకు ఇస్తున్న రాయితీని కుదించడం గోరుచుట్టుపై రోకటి పోటులా పరిణమించింది.
తొలుత యూనిట్ ధర రూ.9.75 లు ఉండేది. గత ఏడాది చంద్రబాబునాయుడు దానిని రూ.2లకు తగ్గించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.50 పైసలకు తగ్గించారు. ఐదెకరాలు చెరువుల లోపల వారికే రాయితీ వర్తింప చేయడం వల్ల విద్యుత్ వినియోగానికి యూనిట్ రూ.6.89 పై చెల్లించాల్సి ఉంది. అధిక యూనిట్లు ఖర్చు చేసేవారు లక్షల్లో విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఆన్‌లైన్లో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకుంటే విద్యుత్ రాయితీలు వరిస్తాయి. 5 ఎకరాలలోపు వారికి రూ.6.89 యూనిట్ ధరలో రూ.5.39 రాయితీ వస్తుంది .
అప్పుడు రైతు కేవలం రూ.1.50 మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా ఐదెకరాలు దాటిన ఆక్వా చెరువుల నుంచి యూనిట్‌కు రూ.3.85 చొప్పున వసూలు చేస్తారు. ఆక్వా జోన్లో లేని ప్రాంతాలలో యూనిట్‌కు రూ.6.89లు వసూలు చేస్తారు. 10 ఎకరాలు, 20 ఎకరాల ఆక్వా చెరువుల ఉన్న రైతులకు గతంలో రూ.15 వేల బిల్లు వస్తే తాజాగా రూ.25 వేల వరకు బిల్లులు వస్తున్నాయి. తొలి నుంచి రొయ్యల సాగులో అనుభవం ఉన్నవారే ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వారు సైతం విద్యుత్ కోతల తాకిడికి తట్టుకోలేక అల్లాడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.