ఆంధ్రప్రదేశ్ లో క్రాప్ హాలిడేస్ ప్రకటించిన వైనాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.వైసీపీ ప్రభుత్వ చర్యల వల్ల ఏపీ రైతులు లేని రాష్ట్రంగా మారుతోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రాప్ హాలిడేలను నిలిపివేయాలని లోకేశ్ తెలిపారు.వ్యవసాయంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే గతేడాది కర్నూలు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించారని గుర్తు చేశారు. గతేడాది రైతుల సమస్యలు పరిష్కరించి ఉంటే... ఈ ఏడాది ఎక్కువ ప్రాంతాల్లో క్రాప్ హాలిడే వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.