చర్మంలో తేమ లేకపోవడం వల్ల చర్మంలోని కొవ్వు ఆమ్లాలు తగ్గుతాయి...,తద్వారా చర్మం పొడిబారుతుంటుంది. ఇది చాలామందిలో సహజంగా కనిపించే సమస్యే. కానీ తేలికగా తీసెయ్యకూడదు. చలికాలంలో పొడిచర్మం ఉన్నవారి బాధలు అన్ని ఇన్ని కావు. అలాంటివారు ఇంట్లోనే దొరికే సహజమైన పదార్థాలతో ఈ సింపుల్ చిట్కాను పాటించి చూడండి. పొడిచర్మం నుండి తక్షణ విముక్తిని పొందుతారు.
సూర్యకాంతి, కాలుష్యం మరియు పొడిబారడం వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధించడానికి మాయిశ్చరైజర్ ముఖ్యం. ఇందుకోసం ఆలివ్ ఆయిల్ బాగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు మొటిమల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆలివ్ నూనె మరియు చక్కెరతో చేసిన స్క్రబ్‌ను ముఖానికి తరచూ రాస్తూ ఉండండి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ముఖంపై ఉంచుకుని ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.