వంటలకు కమ్మని రుచితో పాటు సువాసనను కలిగించే అద్భుతమైన మహత్యం ఒక్క పుదీనా కే సొంతం. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినాను డైట్ లో చేర్చుకుంటే,రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. పుదినాను నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. అవేంటో ఓ లుక్కేద్దామా..
-- పుదీనాతో తయారు చేసిన తీ తాగితే మలబద్ధకం మాయమవుతుంది. పుదీనా శరీరంలోని మలినాలను బయటకు పంపి, పొట్టను శుభ్రపరుస్తుంది.
-- పుదీనా ఆకులను నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడటమే కాదు.. చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమవుతాయి.
-- కీళ్ళ నొప్పులతో బాధపడేవాళ్లు, పుదినాను ఆహారంలో భాగం చేసుకుంటే, కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ అవ్వొచ్చు.
-- కడుపునొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.