--- కమలాపండ్లను తిన్న తర్వాత వాటి తొక్కలను పడెయ్యకుండా, వాటితో దంతాలను మృదువుగా రుద్దాలి. ఇలా చెయ్యటం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ శుభ్రపడుతుంది. దంతాలు తెల్లగా మెరుస్తాయి. బాక్టీరియా నశిస్తుంది.
--- తమలపాకుతో ఇంటిలో తయారుచేసే తాంబూలాన్ని తినటం వల్ల, శరీర వేడి తగ్గడమే కాకుండా, తీపి తినాలి అనే విపరీతమైన కోరిక (షుగర్ క్రేవింగ్స్) ను అదుపులో ఉంచుతుంది. ఎసిడిటీ, తలనొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
--- క్యారెట్లను పచ్చిగా తింటేనే ఆరోగ్యమని చాలామంది అలానే తింటుంటారు. కానీ, ఉడకబెట్టిన లేదా వండిన క్యారెట్లు ఆరోగ్యానికి మరింత మేలును కలుగజేస్తాయి. వండిన క్యారెట్లను తినడం వల్ల వాటిలో ఉండే హార్డ్ సెల్యులోజ్ వాల్ పగిలి, కెరోటినాయిడ్స్ పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి.