అమెరికాలోని మిస్సౌరీకి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కారులో శృంగారంలో పాల్గొంది. ఆ తర్వాత ఆమెకు అతని నుండి సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అనే లైంగిక వ్యాధి సోకింది. దీంతో ఆ మహిళ ఆ కారు బీమా సంస్థే బాధ్యత వహించాలంటూ ఆ సంస్థపై 5.2 మిలియన్లు (రూ.40 కోట్లు) దావా వేసింది. ఇటీవల ఈ కేసును విచారించిన జాక్సన్ కౌంటీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ఆ బీమా సంస్థ హైకోర్టుకు వెళ్లనుంది.