మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణసంబంధ సమస్యలను పోగొడతాయి. ఒక పెద్దగ్లాసు మజ్జిగలో 50-80 కెలరీలు ఉంటాయి. మజ్జిగ తాగితే కడుపు నిండినట్లు ఉంటుంది. మళ్లీ ఏదైనా తినాలనిపించదు. బరువు తగ్గాలనుకునే వారు తినే ముందు ఓ చిన్న గ్లాసు మజ్జిగ తాగితే మంచిది. మజ్జిగలో క్యాల్షియం, ప్రొటీన్, బి12 వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎముకకు బలాన్నిస్తాయి.