మనం ఎంత జాగర్తగా ఉన్న కానీ మన శరీరంలో క్రొవ్వు మాత్రం పెరుగుతూనే ఉంటుంది దాని వలన వచ్చే ఆరోగ్య సమస్యలు అంత ఇంత కాదు . ఈ క్రొవ్వు పేరుకుపోయే అవయవం ని బట్టి మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు (జబ్బులు ) స్థాయి ఉంటుంది . కాబట్టి మనిషి శరీరంలో క్రొవ్వు పెరగకుండా కాపాడటం ఎంతో మంచిది . అలానే , మనిషికి గ్యాస్ సమస్య కూడా ఏంటో ప్రమాదకరమైనది . దీని వలన మనిషి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాల ఉన్నాయి .
ఆహరం వేళకు తీసుకోకపోవడం , తీసుకునే ఆహరం పట్ల శ్రద్ధ లేకపోవడం , ఆహరం తిన్న వెంటనే నిద్ర పోవడం లాంటివి శరీరంలో గ్యాస్ పెరగడానికి దోహదపడుతుంది . అలానే ఇందులో ప్రమాదకరమైన గ్యాస్ మన ప్రేగు లోపల నిల్వ ఉండటం . ఇది రాత్రి పూట మనము ఆహరం తీసుకున్న వెంటనే నిద్రపోవడం వలన వస్తోంది . దీని వలన ప్రేగు లోపల నుండి మంట , ఉబకాయత్వం , గుండె పోటు లాంటివి రావడానికి అవకాశం ఉంది .
దీనిని , మనం యోగ ఆసనాల వలన చక్కగా తగ్గించుకోవచ్చు . ఆ ఆసనం పేరే "పవన ముక్తాసనం ". రోజు పొద్దునే నిద్ర లేచిన వెంటనే ఈ ఆసనం ఐదు నిముషాలు చెయ్యడం వలన మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది అలానే శరీరం లో ఉన్న గ్యాస్ బయటికి విడుదల అవుతుంది . ఇప్పుడు , ఎలా చెయ్యాలో చూద్దాం .
ముందుగా వెల్లికలాగా పనుకుని కాళ్ళు ముందుకు చాచి పెట్టాలి . తరవాత ఒక కాలు మాత్రమే మోకాలు భాగంలో మడిచి , మోకాలు భాగాన్ని మీ పొట్ట భాగానికి తాకేలా ప్రయత్నం చెయ్యండి అదే సమయంలో మీ ముఖ భాగం మీ మొకాలుకి తాకేలా ప్రయతించండి . ఇదే తరహాలో రెండవ కాలుతో కూడా చెయ్యండి . ఐతే ఒక కాలుతో చేసేటప్పుడు రెండవ కాలు నిటారుగా క్రింద నేలకు తాకేలా ఉంచాలి . ఇలాగ ప్రతి రోజు నిద్ర లేవగానే నాలుగు సార్లు చెయ్యడం ద్వారా , శరీరంలోని క్రొవ్వు కరగడంతో పాటు , ప్రేగు భాగంలో ఉన్న గ్యాస్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది అలానే మల మూత్ర విసర్జన సులభతరంగా ఉంటుంది . పొట్ట మొత్తం శుభ్రంగా ఉండటం వలన , గాలి పీల్చుకోవడానికి ఎక్కువ సౌకర్యం ఉంటుంది దాని వలన ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి .