ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రసవం ( కాన్పు ) తర్వాత ఇవి  పాటించండి .. లేకుంటే ప్రమాదమే ..

national |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 12:15 PM

ప్రసవం ఐయ్యాక తీసుకోవలసిన జాగర్తలు , ఎన్నో ఉన్నాయి  అందులోనూ మీ ప్రసవం మాములునా లేక ఆపరేషనా అనేది కూడా సరి చేసుకోవాలి . ఆపరేషన్ ఐతే ఇంకా చాల జాగర్తగా ఉండాలి .  ఏదైనా కానీ  కాన్పు తర్వాత తల్లి సమతుల ఆహరం తీసుకోవడం చాల మంచిది . ఎందుకంటే , కాన్పు తర్వాత శరీరంలో  ఎన్నో మార్పులు రావడం జరుగుతుంది . అలాగే , ఆపరేషన్ చేసిన వాళ్లకి కొన్ని అవాంతర సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది . కొంత మందిలో బిడ్డ కాన్పు ఐపోయాక కూడా కొన్ని నెలల పాటు పొట్ట ఎత్తుగా ఉండటం , నీరసంలాంటిది తగ్గక పోవడం , బాగా సన్నగా తయారై బలహీనంగా ఉండటం , ఎక్కువగా నడవలేకపోవడం  లాంటి కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయి .
కాబట్టి, ప్రసవం ఐయ్యాక ఎలాంటి పరిస్థితులలో నైనా   కనీసం రెండు నెలల కాలంలో మీరు మునుపటి స్థాయికి రావాలి . ఆలా రాలేదు అంటే , మీరు అశ్రద్ధ చేస్తున్నట్లే .....! దీని వలన మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది జాగర్త . మంచిగా  సమతుల ఆహరం తీసుకోవడం , యోగ ప్రక్రియలు చెయ్యడం ,  ముఖ్యంగా నడవటం లాంటివి చెయ్యాలి .
అలానే , బిడ్డకు పాలు ఇవ్వడం వలన , నడవటం వలన , మీ శరీరంలోని కండరాలు కదిలి , మీరు గర్భం దాల్చినప్పుడు అవి ఎలా  వ్యాకోచించాయో ( సాగటం ) అలానే , కాన్పు  తర్వాత అవి మళ్ళి వ్యాకోచం తగ్గి మాములుగా తయారవ్వడానికి  నడక చాల  సహాయపడుతుంది .
మీరు ఆపరేషన్ అని ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ (విశ్రాంతి ) తీసుకోవడం వలన కూడా మీకు ప్రమాదం . మీ పొట్ట పరిమాణం తగ్గక పోవడం , శరీరం ఎక్కువ అలిసినట్లు ఉండటం లాంటివి జరుగుతాయి . కాబట్టి మీరు ఇలాంటి  జాగర్తలు తీసుకోవడం చాల మంచిది దీని వలన మీకు తదుపరి కాన్పు  విషయంలో కూడా ఎలాంటి సమస్య తలెత్తదు .  ఒకవేళ మీరు పెద్ద ఆపరేషన్ చేపించుకున్నాక కూడా మీరు  కొన్ని ఆహారపు నియమాలు , వ్యాయామం , కాలి  నడక లాంటివి చాల అవసరం దాని వలన మీరు ఎక్కువగా లావు అవ్వకుండా మరియు మధుమేహం లాంటి వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి .  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com