ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ వ్యాధిని మొదట్లోనే గుర్తించండి ఇలా .... !

international |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 12:16 PM

 క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిన విషయమే ... మనిషి ఆరోగ్యాన్ని పాడుచేసి చివరికి ప్రాణాలు తీసే శక్తీ కలది ఈ క్యాన్సర్  వ్యాధి . కాబట్టి ఈ క్యాన్సర్  వ్యాధిని దీని లక్షణాలను మొదట్లోనే గుర్తించినట్లయితే  కొంత వరకు మేలు జరిగినట్లే . అలానే దేనిని గ్రహించడం వలన  నివారించే అవకాశం కూడా లేకపోలేదు .  
 క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని ఒకేరకానికి చెందిన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కొంచెం కష్టతరమైన విషయంగా చెప్పుకోవచ్చు . తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవ భాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి.
ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్‌ గ్లాండ్స్‌ , బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర వాపు , కొన్నిసార్లు కొన్ని అవయవాలనుంచి రక్తస్రావం..., మనిషి శరీరం అంత నల్లగా మారిపోవడం , ఎక్కువగా నడవలేకపోవడం , కళ్ళు తిరిగి పడిపోవడం , శరీరం శక్తి కోల్పోయి  సన్నగా తయారవ్వడం లాంటివి  సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలు  ఉన్న ప్రతి మనిషి క్యాన్సర్ బాధితుడు  అని చెప్పలేము . వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి.
క్యాన్సర్  వ్యాధి అనేది చాల రకాలుగానే వస్తుంది .  రక్త పోటు ( blood  cancer ), ఎముకల కాన్సర్ (bone  cancer ), గొంతు క్యాన్సర్ , పేగు క్యాన్సర్  ఎలా చాల రకాల కాన్సర్ వ్యాధులు ఉన్నాయి . అదే ఆడ వారిలో ఇంకా కొన్ని గర్భాశయం కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు వాస్తు ఉంటాయి వీటిలో , రొమ్ము క్యాన్సర్ , కడుపులో గడ్డలు  లాంటివి ప్రమాదకరమైనవి .
 క్యాన్సర్  వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి . మనకు ఉన్న వేరే ఆరోగ్య సమస్యల వలన అవి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది . అలానే తీసుకునే ఆహరం , జీవించే వాతావరణం, ధూమపానం , మద్యపానం , చెడు  వ్యసనాలు  కూడా ఈ క్యాన్సర్  వ్యాధి రావడానికి దోహదపడతాయి .
కారణాలు ఏమైనా , ఇది  చాల ప్రమాదకరమైనది కాబట్టి త్వరగా చికిత్స తీసుకోవడం మంచిది లేకుంటే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు  వైద్య నిపుణులు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com