ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు  తొమ్మిది నెలలు మోయకుండానే .. తల్లి అవ్వొచ్చు . పద్దతి ఫాలో అవుతున్న ప్రముఖులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 12:18 PM

ప్రతి మనిషి జీవితంలో , తనకంటూ ఒక కుటుంభం , పిల్లలు ఉండాలి , తన వంశం వృద్ధి చెందాలి అని ఉంటుంది . దాని కోసం కొంత మంది సహజీవనం అనే పద్దతిని అలానే ఎక్కువ మంది పెళ్లి అనే బంధాన్ని ఏర్పరచుకుంటారు .  తర్వాత వారు మొదటగా ఆశించేది సంతానం . కొంత మంది దంపతులకు త్వరగా పిల్లలు పుడతారు మరి కొంత మంది దంపతులకు పిల్లలు ఆలస్యంగా పుడతారు. పాపం మరికొంతమందికి ఎంతలా కోరుకున్న పిల్లలు పుట్టరు. కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలు పుట్టక పొతే, సమాజం మరియు చుట్టాలు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా గొడ్రాలు అంటూ హేళనగా అవమానిస్తారు . ఇలాంటి  సందర్భాలలో మానసిక ఒత్తిడికి గురై కొంత మంది ఆత్మ హత్య చేసుకున్న కధనాలు మనం విన్నాం . కానీ , ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిన తరవాత పిల్లలు పుట్టని దంపతులకు కూడా పిల్లలు కలిగే  వసతి లభిస్తుంది.  ఈ పద్ధతినే సరోగసి విధానం అని అంటున్నారు . ఈ పద్దతి ద్వారా సంతానం కలగని దంపతులు సంతాన ప్రాప్తి చెందవచ్చు.
 అసలు ఈ సరోగసీ విధానం  అంటే ఏమిటో  ఎప్పుడు తెలుసుకుందాం .  
కొన్నిఆరోగ్య సమస్యల వల్ల దంపతులకు సంతానం కలగదు కాబట్టి ఈ సరోగసీ ప్రక్రియ లో ఒక ఆరోగ్యవంతమైన మహిళను తమకు బదులు గర్భం దాల్చడానికి ఎన్నుకుంటారు. సరోగసీ  విధానం (ప్రక్రియ)రెండు రకాలుగా చేయబడుతుంది ఒకటి ట్రెడిషనల్ సరోగసీ రెండు జెస్టేషనల్ సరోగసీ.
ట్రెడిషనల్ సరోగసీ : ఈ రకమైన సరోగసీ లో కేవలం భర్త యొక్క వీర్యంను గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ మహిళ 9 నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది . ఈ ప్రక్రియ కొంత మంది  మహిళలు డబ్బులు తీసుకొని చేస్తారు. ఈ ప్రక్రియ వలన కొంత లోపం ఏమిటంటే తండ్రి మాత్రమే మనం కోరుకున్న వారి జీన్ అవుతుంది . తల్లి మాత్రం ఎవరినైతే బిడ్డని కనడానికి ఎన్నుకుంటామో వారు తల్లిగా పరిగణించబడతారు .
జెస్టేషనల్ సరోగసీ : ఈ రకమైన సరోగసీ లో భర్త వీర్యం ,  భార్య ఎగ్స్ తీసుకొని IVF అనే పద్దతి ద్వారా కృత్రిమంగా బిడ్డను తయారు చేస్తారు. ఇలా తయారు అయిన బిడ్డను గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ కడుపులో పెంచుతారు. ఈ ప్రక్రియలో పుట్టబోయే బిడ్డ ఇద్దరు దంపతులకు చెందుతాడు. సరోగసీ పెళ్లి కాని యువకుడు లేదా మహిళ కూడా చేసుకోవచ్చు. పెళ్లి ఇష్టం లేని వారు పిల్లల కోసం ఈ పద్దతిని ఉపయోగించి పిల్లలను కంటారు.మగ వారు ఆడవారి ఎగ్స్ ను డోనర్ వద్ద, అలాగే ఆడ వారు వీర్యం ను డోనర్ వద్ద తీసుకొని పిల్లలను సరోగసీ ద్వారా కంటారు.
ఈ కాలంలో షారుఖ్ ఖాన్, ఏక్తా కపూర్, కరణ్ జోహార్ , మంచు లక్ష్మీప్రసన్న, బాలీవుడ్‌ బ్యూటీ లీసా రేకు , సన్నీ లియోని,  శిల్పా శెట్టి ,  ప్రీతీ జింటా, ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్, సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్, సీమాసచ్‌దేవ్ దంపతులు లాంటి సెలెబ్రిటీలు సరోగసీ ద్వారానే తమ తమ పిల్లలను కన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com