స్త్రీ జీవితంలో ఈ మోనోపాజ్ దశ చాల కీలకమైనది . ఇది ఆడవారికి 45-50 సంవత్సరాల వయస్సులో వస్తుంది . చాల మంది ఆడ వారు ఇంకా ఏముందిలే వయస్సు ఐపోయాక వీటన్నిటిని అక్కడ ఎక్కడ చుస్తాంలే అనే భావన ఉంటుంది కానీ , ఈ సమయంలో మీరు జాగర్త తీసుకోకపోతే మీ ప్రాణాలకి ప్రమాదం కలిగించే జబ్బులు రావడానికి అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు .
అసలు ఈ మెనోపాజ్ అంటే ఏమిటి? తెలుసుకుందాం .....
ప్రతి స్త్రీకీ 45--50 సంవత్సరాల వయసులో వరసగా సంవత్సర కాలం అండం విడుదల రాకుండా ఆగిపోతే దానిని "మెనోపాజ్" అంటారు. ఇది సహజమైన మార్పు. ఇది జబ్బుకాదు. ఇది ఒక దశ. ఇది జన్యు సంతతి కూడా అనగా సాధారణంగా ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఆ కుటుంబంలో పెద్ద వాళ్లయిన స్త్రీలకి ఏ వయసులో నెలసరి ఆగిపోతాయో దాదాపు అదే వయసులో తర్వాత వాళ్లకి కూడా ఆగి పోతాయి.
45 - 50 ఏళ్ల మధ్యలో ఎప్పుడయినా ఆగిపోవచ్చు. నలభై ఏళ్ల లోపే ఆగిపోతే "ప్రిమెచ్యూర్ మెనోపాజ్" అంటారు.చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి అంటే తొలగించిన సంవత్సరానికే "మెనోపాజ్" లక్షణాలు కనపడతాయి.అండాశయం నుండి అండాలు విడుదల కాకపోవడం, అందువలన హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినడం, దానివలన నెలసరి ఆగిపోవడం జరుగుతుంది.
ప్రతి స్త్రీకీ గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు అమర్చబడి ఉంటాయి. అవి పుట్టుకతోనే నిర్ణీత సంఖ్యలో ఉన్న అండాలను కలిగి ఉన్న బుట్టల్లాగా ఉంటాయి. యవ్వన దశ వచ్చాక నెలకొకటి చొప్పున పక్వమయి, విడుదలయి, ఫాలోపియన్ ట్యూబ్‌ని చేరుకుంటాయి. అక్కడ వీర్యకణంతో కలిస్తే ఫలదీకరణం చెందుతుంది. లేని చో నెలసరిలో రక్తస్రావంతో పాటు బయటకి విడుదల అవుతుంది .
ఈ ప్రక్రియ అంత క్రమంగా జరగడానికి, మెదడులోని హైపోథలామస్ అనే భాగమూ, పిట్యూటరీ గ్రంథీ, ఓవరీలనుండి స్రవించే హార్మోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి . దీనినే "హైపోథలామో, పిట్యూటరీ, ఒవేరియన్ యాక్సిస్" అంటారు.
హైపోథలామస్ నుండి వచ్చే హార్మోన్లు, పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపితం చేస్తే, పిట్యూటరీ నుండి వచ్చే హార్మోన్లు ఓవరీని ప్రేరేపితం చేస్తాయి. ఓవరీ నుండి అండంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు విడుదలయ్యి గర్భాశయం మీద పనిచేసి, గర్భాశయంలో పిండం ఎదుగుదలకి కావలసిన మార్పులు జరిగేటట్లుగా చేస్తాయి.మెనోపాజ్ దశలో అండాలు పూర్తయిపోయి విడుదల కాకపోవడం వలన మొదట ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఈ రెండింటి స్థాయీ తగ్గడంతో పిట్యూటరీ నుండీ వచ్చే F S H అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది.
ఈస్ట్రోజన్‌ని ఫెమినైన్ హార్మోన్ అంటారు. ఇది తగ్గి పోవడం వలన స్త్రీలలో కొన్ని శారీరకమైన, మానసికమైన మార్పులు వస్తాయి. మోనోపాజ్ లక్షణాలకి ఇవే కారణం.
మెనోపాజ్ లక్షణాలు :
కొందరిలో అండం విడుదల హఠాత్తుగా ఆగిపోతాయి, కొంత మందిలో క్రమేణా ఆగిపోతాయి
సక్రమంగా నెలసరి రాకుండా ఎక్కువ గ్యాప్ తీసుకోవడం . అధిక రక్త స్రావం, తక్కువగా రక్తస్రావం కనపడుతుంది
ఒక సంవత్సరం కాలం నెలసరి రాకుండా ఆగిపోతే మెనోపాజ్ వచ్చినట్టు గుర్తించాలి .
50 సంవత్సరాలు వయస్సు పైబడిన తర్వాత కూడా రక్తస్రావం కనపడుతుంటే, ఇతర వ్యాథులేమైనా వచ్చాయేమో అని పరీక్షించుకోవాలి.
తొందరగా అలసి పోవడం , ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం - హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టడం , రాత్రుళ్లు నిద్రలో మెలకువ రావడం (నైట్ స్వెట్స్) , గుండెదడ , నిద్ర పట్టక పోవడం , మానసికమైన ఆందోళన, చిరాకు, కోపం, డిప్రషన్, కారణం లేకుండా ఏడుపు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి .
చికిత్స :
ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించడం, ప్రతి రోజు వ్యాయామం, వలన ఎక్కువ బాధ పడకుండా చేస్తాయి. ఆకుకూరలూ, తాజా పళ్లూ, సోయా ఉత్పత్తులూ నిమ్మ జాతి రసాలు ఉన్న ఫలాలు తీసుకోవడం మంచిది .
ఆయిలీ ఫిష్ ఆహారంలో తీసుకుంటే , మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలని అధిగమించవచ్చని కొంత మంది నిపుణులు చెప్పడం జరిగింది .
ధూమపానం,మద్యపానం , మసాలాలు సమస్యలని ఎక్కువ చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటె మంచిది .
కాల్షియం మాత్రలు మెనోపాజ్ తర్వాత ప్రతి స్త్రీ జీవితాంతం వాడవలసి వస్తుంది . అవసరాన్ని బట్టి విటమిన్ డి త్రీ మాత్రలు వాడవలసి వస్తుంది .
థైరాయిడ్, డయాబెటిస్, బీపీ - వీటికి సంభందించిన మాత్రలు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి .