చర్మ రక్షణ కోసం శరీరంలోని సెబాసియస్ గ్రంథులు సెబమ్ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఇది కావలసిన దాని కన్నా ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వలన చర్మం జిడ్డుగా మారుతుంది. జిడ్డు చర్మం వలన చర్మం మీద మొటిమలు రావడం నల్లటి మచ్చలు ఏర్పడటం వంటివి వస్తాయి . ఈ సమస్య నుండి బయటపడాలంటే , రోజుకి రెండు లేదా మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది.
ప్రతిరోజూ ఆల్కహాల్ ఫ్రీ టోనర్‌ను మాత్రమే వాడాలి. ఇది అదనపు ఆయిల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.వారానికి ఒకసారైనా పేస్ మాస్క్ వేసుకోవడం మంచిది . దీను వలన చర్మం జిడ్డుని పోగొట్టి కాంతివంతంగా తయారవడానికి దోహదపడుతుంది .
బయటకు వెళుతున్నట్లయితే తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ ఉపయోగించాలి లేదా ఎండ సరాసరి మన చర్మానికి తాక కుండా ఏదైనా వస్త్రాన్ని ఉపయోగించడం మేలు . జింక్ లేదా టైటానియం డైఆక్సైడ్ ఉన్న మినరల్ బేస్డ్ సన్‌స్ర్కీన్ ఉపయోగిస్తే చర్మం నుంచి అదనపు ఆయిల్‌ను గ్రహిస్తుంది.
వారంలో రెండు మూడుసార్లు ఫేస్‌మాస్క్ అప్లై చేసుకోవాలి. చందనం, ముల్తానా మట్టి, బెంటోనైట్ క్లే, కయోలిన్ ఉన్న మాస్క్ ఉపయోగిస్తే చర్మంపై ఉన్న అదనపు ఆయిల్‌ను గ్రహిస్తాయి.
మేకప్ వేసుకొని ఎప్పుడూ పడుకోకూడదు. దీనివల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి ఇతర సమస్యలు మొదలవుతాయి. అలానే మేకప్ కి ప్రాధాన్యత తగ్గించడం మంచిది . నిమ్మ జాతి ఫలాలు , రసాలు ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది . ఇవి శరీరంలో ఉత్పత్తి అవుతున్న సెబమ్ ని తగ్గించడానికి మరియు చర్మం ముదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
టమాటా, కలబంద లాంటి వాటి చేత ముఖాన్ని సున్నితంగా రబ్ చేసుకోవాలి . ఇలా సాయంత్రం స్నానానికి ముందు ఒక పదిహేను నిమిషాలపాటు చెయ్యడం వాళ్ళ మీ చర్మం జిడ్డుని వీడి కాంతివంతంగా మారుతుంది.