ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతో ముఖానికి అందం తెలుసా.....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 12:22 PM

ముఖం అందంగా కనిపించడానికి ఆడవారు చెయ్యని ప్రయత్నం లేదు అంటే నమ్మక తప్పదు . కానీ , వీరు నిత్యం ఇంట్లో వంటింటికి అవసరమైన అన్ని వస్తువులతో కలిసి ఉన్న , తెలిసి ఉన్న కానీ బ్యూటీ పార్లర్ కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు . కానీ సహజమైన పద్దతిలోనే మీ ముఖ సౌందర్యం పెంచుకోవడానికి ఎన్నో వంటింటి చిట్కాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు అందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే అంట ... మరి అవి ఏమిటో తెలుసుకుందాం .
ముఖం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో చిట్కాలు ఉన్న , వాటిలో సులభమైనది అలానే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ముఖ్యంగా పెరుగు ప్యాక్ . పెరుగు తోనా అని ఆర్చర్యపడకండి  , ఎలా ఉపయోగించాలో ఆలా ఉపయోగిస్తే మనకు వంటింట్లో ఉన్న అన్ని  ఉపయోగపడేవే .
ఇక పోతే , పెరుగు ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్లు  తీసుకొని అందులో బాగా పండిన అరటిపండు కొంచెం తీసుకొని , రెంటిని కలిపి మెత్తగా మిక్సీ వేసుకోవాలి . తర్వాత దానిని తీసి అందులో కొంచెం నిమ్మరసం కలిపి దానిని  ముఖానికి ఒక ప్యాక్ లాగ వేసుకోవాలి . ఇలా  వారానికి మూడు రోజులు చెయ్యడం వలన మీకు నాలుగు వారాలలోనే ఫలితం కనపడుతుంది . అలానే ఎండ కి తిరగడం తగ్గించాలి రోజు మీకు వీలు ఉన్న అన్ని సార్లు ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి .
అలానే , పెరుగు (కొంచెం పులుపు తగిలినది ) మీ ముఖానికి సరిపడినంత తీసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ , తేనే కలిపి దానిని ముఖానికి ప్యాక్ లాగ చేసుకొని , ఒక అరగంట సేపు ఉంచుకోండి . తర్వాత కొంచెం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే   మీ  ముఖం చాల కాంతివంతంగా , శుభ్రంగా , మంచి రంగులోకి మారుతుంది .
నిమ్మజాతి ఫలాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి . ఎందుకంటే అందులోని సిట్రిక్ ఆమ్లం మన చర్మానికి జిడ్డుని పట్టనీయకుండా చర్మం ఎప్పుడు  ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com