కాలం మారుతున్న మనిషిలోని ఆశ మాత్రం చావడంలేదు. వందేళ్లు సంసార జీవితాన్ని సైతం ఆర్థిక కోణంతో ఇంకా ముడిపెడుతూనే ఉన్నారు. బైక్ ఇవ్వలేదని పెళ్లి చేసుకోకుండా ఓ పెళ్లి కొడుకు ఉడాయించిన ఘటన తాజాగా చోటు చేసుకొంది. ఇదిలావుంటే దేశంలో ఈ మధ్య వివాహాలే హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. పెళ్లి మండపంలో వరుడో.. వధువో.. భలే షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కాన్పూర్‌లో ఓ పెళ్లి కొడుకు మంచి తాగి వస్తానని.. అటు నుంచి అటే పారిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. అక్కడ సామూహిక వివాహ వేడుకను ఏర్పాటు చేశారు. ఓ మంత్రి ఆధ్వర్యంలో అక్కడ మొత్తం 144 జంటలకు పెళ్లి చేయాలనుకున్నారు.
దాని కోసం అంతా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ మంత్రి ధరంపాల్ సింగ్ హాజరయ్యారు అయితే అదే సందర్భంలో ఓ పెళ్లి కొడుకు మంచి నీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాలేదు. దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరంతా వెదికారు. అయినా అతని ఆచూకీ తెలియరాలేదు. అయితే కట్నం విషయంలో తేడా రావడంతోనే పెళ్లికొడుకు వెళ్లిపోయినట్టు తెలిసింది.
అతను కట్నం కింద మోటార్ బైక్ కావాలని అడిగాడని, కానీ ఆర్థిక సమస్యల వల్ల ఇవ్వలేకపోయామని వధువు తల్లి చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న వరుడు మండపం నుంచి పారిపోయాడని ఆరోపించింది. కావాలనే ఓ ప్లాన్ ప్రకారమే పెళ్లి మండపం నుంచి పారిపోయాడని వధువు, ఆమె తల్లీ అంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య పెళ్లిల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ ఘటన జరిగింది. మల్కాపూర్ పంగ్రా గ్రామంలో ఓ యువతి, యువకుడికి పెళ్లి ఖరారు చేశారు. ఏప్రిల్ 22న సాయంత్రం నాలుగు గంటలకు పెల్లి ముహూర్తం పెట్టారు. కానీ ఆ సమయానికి పెళ్లి కొడుకు మండపానికి చేరుకోలేదు. అక్కడ పెళ్లికొచ్చిన బంధువుల నుంచి పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు వెయిట్ చేశారు. కానీ పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో తప్ప తాగి, డ్యాన్స్‌లు వేసుకుని.. నాలుగు గంటల ఆలస్యంగా మండపానికి వెళ్లాడు. దాంతో వధువు తండ్రి వేరే అబ్బాయితో అమ్మాయికి పెళ్లి చేసేశాడు.